పుట:2015.393685.Umar-Kayyam.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

ఉమర్ ఖయ్యామ్

446

ఈ సుర కర్మబాహ్యులకు నెంతొ జవఁబు, బలంబుఁ గూర్చు ; ము
న్నీ సుర బుద్ధియన్నఁ దరళేషణమోమునఁ జేరుచుక్క గా
దే ! సుర "రమ్మజాను" నెలనించుకఁ ద్రావఁగఁబోవ నా "షవాల్"
మాసము రాత్రిపండుగ ప్రమాదము గల్గునె యెంత ద్రావినన్.

447

ఉపవాసంబుఁ దపంబుపై నెపుడు నాకుత్సాహ మేపారునో
యపుడే ధన్యత గూడె నంచు మది నూహల్ పుట్టునె గాని, మ
ద్యపు సంపర్కముచేఁ దపశ్శుచి విలియ్యంబయ్యెఁ ; బానాప్తిచే
నుపవాసంబు నశించెఁ జేయునది యోమో తోఁచ దింకేపయిన్.

448

డెబ్బదేఁడుల యీడు మూఁడినది మాకుఁ
బాపభీతియు, శుచియుఁ దపస్సు విడిచి,
యింక సుర నభ్యసింతు ; నెంతేని సుఖము
లిపుడె పడయనియెడల నింకెపుడుఁగూడు ?

449

నీవు రాజాధిరాజువై నెగడుచున్న
మద్యమహిమం బెఱుంగ ; వా మహిమ నెఱుఁగఁ
జెప్పెదను నేడువారాల నెప్పుడైనఁ
ద్రావిన మనంబు వికసించి తనరుఁ గాదె !