పుట:2015.393685.Umar-Kayyam.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

109

426

భంగు కుమతికెకూర్చు ; నీభంగు త్రాగు
నట్టి నూర్గురికంటె మధ్వాసవంబు
కణము మేలని విబుధలోకంబు దలఁచుఁ
బాట మేల్గాదె యాసవపాత్రకంటె !

427

సురకన్యంబగు వస్తువులన్నియును నేశోధించి వర్జించితిన్
సురయే సుందరవీరకాంత యిడినన్ శోభించు నెంతేనియున్
దిరిపంబెత్తిన నిస్పృహందవిలి భ్రాంతిన్‌బోల మేలేయగున్
సుర బ్రహ్మాండముకంటె మేటియని నే స్తోత్రంబు గావించెదన్.

428

ఏ నిందుంటిని ; నా మనోహరియు నిందేయున్న ; దీ సత్ప్రభా
తానందప్రతిపాదకంబయిన మద్యంబిందు రాజిల్లుఁ ; గాం
తా ! నన్నేటికి వీని మానుమను దత్యంతంబు ప్రావడ్డ గా
ధానైత్యంబుల నేలచెప్పెదవు ? మద్యంబిమ్ము హృచ్ఛాంతికిన్.

429

దీపము మండుచున్నది ; ప్రదీప్త సుధాంశుఁడు వెల్గుచున్న వాఁ
డోపిన మద్యభాండ మట నున్నది ; యాసవపానమత్తయై
యా పడకింటఁ బ్రేయసి ప్రియంబున రమ్మనుచున్న దీ మన
స్తాపము పోవ దిం కిచటఁ జంపకు మోసఖి తెమ్ము మద్యమున్.