పుట:2015.393685.Umar-Kayyam.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

103

402

బ్రతు కను పానపాత్ర శిఖిఁ బాచనమయ్యెడు నంతదాఁక నే
నతిముద మందుచున్ జషకమందు భుజించుచు నుందు నావిషా
దతతిని ; నోకులాలక ! పదంబడి నాతనుమృత్తుచే ఘట
ప్రతతి రచింతువేని మదిరారస మమ్మెడువారి కమ్ముమీ.

403

కాల మడుగనిచోఁ బోరఁగలను ; కీర్తి
రానిచో నపకీర్తి రానీ ; నవాస
వంబదే సిద్ధమైయున్నదది గ్రహింప
నట్టివాని నెత్తిని ఱాయిఁబెట్టు మదిగొ.

404

మధుకలశంబు నాకొసఁగి మంజులగానము సేయిమింక నీ
మధుసమయంబు కోయిలలమాడ్కిఁ గుహూకల కాకలీసుధా
మధురరవంబులన్ గలియ మద్యము ద్రావెడువేళ గానమే
వృథ యనుచో సురాకలశ మేటికి గల్గలఁబాడు వంచినన్ ?

405

మతముల్ "మానసమున్ గలంచి చెఱుచున్ మద్యం"బటంచాడు కు
త్సితవాదంబుల నాలకింపకుము ; నీ జీవాన కాహారమున్
సతతాధ్యాత్మవిహార సమ్మద సముత్సాహంబు వాంఛించినన్
గృతకాద్రిన్ జని శీధుద్రావి యట నెంతే పాట లాలింపుమీ.