పుట:2015.393685.Umar-Kayyam.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

97

378

ఓ చెలులారా ! మీరు ప్రియమొప్పఁగ నేయెడనైన నొండొరుల్
చూచుకొనంగ నోచుకొనుచో నపు డేచెలియైన శీథువెం
తేచషకాళిఁ బోసి యిడెనేనియు నా మధువేళ నయ్యొ యెం
దో చనిఁనాడు, లేఁడు నయిదో డని నన్నుఁదలంపు సేయుఁడీ !

379

స్వర్గమున నీశుఁ డిడ సుర బాసఁజేసె
నిఁక నిషిద్ధ మెట్లగు మధు విందు నందు
"అరబొకఁడు" త్రాగి యొంటెను నరకుకతన
మన "రసూ" లదిగని మాన్పె మధువుఁ ద్రావ.

380

మదువె యాహార మిడి నన్ను మనుపవలయు
పలితవదనంబు కడు నెఱ్ఱబాఱునట్లు
నేను జచ్చిన మధువుచే స్నాన మార్చి
ద్రాక్షపేటిక నిడఁగోరెదను సఖులను.

381

వేయిభక్తుల పెట్టు మైరేయపాత్ర
"చీనసామ్రాజ్య" మొకగ్రుక్క శీధుపాత్ర
దీనికన్న జగాన మిన్నైన దేది ?
ప్రాణముల కన్నఁ బ్రీతి చేఁదై నమధువు.