పుట:2015.393685.Umar-Kayyam.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

ఉమర్ ఖయ్యామ్

374

భానుఁ డుషస్సునాఁబరగు వాగుర వే విసరెన్ జగంబుపైఁ ;
బూని యహస్సుకై "కుసురు" పోసెను మద్యము పాత్ర ; నీ సురా
పానము గొమ్ము మేల్కొలుపుపాడెడువా రపుడే జగంబునన్
గానము చేసి చాటి పరంగన్ బ్రకటించిరి యీరహస్యమున్.

375

నేఁటినిసిఁ గ్రొత్త చషకంబుతోటి సురను
ద్రావెదను, రెండుగుక్కలు త్రావి భాగ్య
శాలినై తుది మతమును జాఱవిడిచి
ద్రాక్షరసపుత్రిక వరించి క్రాలువాఁడ.

376

ఏను మృతుండ నైనఁ దనువెంతయు మాయముఁ జేసివేయుఁ ; డీ
దీనిని జూచి యన్యులకుఁ దెల్వి ఘటిల్లెడునట్టు లంత నా
మేనగు మృత్తికన్ సురను మేళనమున్ బొనరించి దానిచే
సానికఁజేసి శీధుకలశంబున మూఁతగ మూయుఁ డావలన్.

377

ఉదయరాగంబు లుదయించుచున్న యపుడె
కల్లుచషకంబు కేల శోభిల్ల వలయు
చేఁదుగాఁ దోచు హితమెప్డు, చేఁదు మధువు
గూడ హితమగుఁ గాదె యేనాఁడుఁ జూడ.