పుట:2015.393685.Umar-Kayyam.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

95

370

కలికి ! సురాసవంబె చిరకాలమునుండి హితంబునాకు ; నె
చ్చెలి ! సుర లేక జీవనము చేసెడు పద్ధతి గాదు నాది ; యి
య్యిల సురద్రావువాని కసలే మతమన్నది లేదఁటండ్రు ; చే
రలఁ గబళీంతు నేను మదిరన్, సురయే మతమౌను నా కెటన్.

371

మదిరను ద్రావెదన్ బహుళ మార్గములన్ బ్రజలెల్లఁ గూడ దీ
మదిర యసమ్మతంబు, మతమార్గము గాదిది శత్రువండ్రు ; నా
మది కిది నచ్చె ; శత్రువుల మాంసము రక్తము పీల్చుటే యఘా
స్పదముగదా ! సదా మదిరఁ బానముఁజేసెద వైర మారఁగన్.

372

తుచ్ఛముగాదె యే హృదయతోయజమందునఁ జింత లేదొ ప్రే
మేచ్ఛను నేలతాంగినొ వరించి వియోగముచేత వెంగలై
రెచ్చదొ యేదినంబు మయిరేయములేనిదె తేరగా వృథా
పుచ్చునొ కాన యేదినము బూదెను బోయకు మేకతంబునన్,

373

మధువును, గాయనీమణిని మానకచూపుఁ డుషస్సునందె యీ
మధు విడెదన్ ; బ్రభాతముల మద్యముఁగ్రోలుటె భాగ్య మిద్ధరన్
మధువును, మానినీప్రణయమంజుల గానసుధా ప్రపూర్ణన
త్సథమును, మైక మీత్రయ మవశ్యము లేయెడ మర్త్యకోటికిన్.