పుట:2015.393685.Umar-Kayyam.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

ఉమర్ ఖయ్యామ్

351

వృథగానిన్నను, మొన్న, పోయినవి ; భావింపంగ సంతోషమున్
వ్యధయున్ లాభము నష్టముల్ గడచె నేఁ ; డత్యంత మీ ప్రొద్దునా
పథమందేచనుఁ, గల్మిలేములకు నొవ్వంజెల్ల దానందివై
వృథుమర్యాద నటింపు మీదినము నట్లేపోవుఁ బూర్వాకృతిన్.

352

ఓసఖి ! యొక్కగ్రుక్కెడు సముజ్జ్వల శీధురసంబు నిమ్మ ! యీ
శ్వాస ముహూర్తమాత్రమె ; ప్రపంచమునందు సుఖంబు గల్గు వి
శ్వాసమె గల్గ ; దే కొలఁదిపాటి లభించినఁ జాలు ; లోకమం
దాసయె గాని యొక్కటి యథార్థముగా ఫలియింప దేరికిన్.

353

చావనిన భయమంద ; నీచావు బ్రతుకు
కంటె శ్రేయంబు ; దేడుఁడు కరుణచేత
ప్రాణములు పోసెఁ ; దిరిగి యా ప్రాణములను
దీయునెడ వేడ్కతోడ నందించువాఁడ.

354

జగతీగర్భవిశాల మెంతగలదో చర్చింపఁగారాదు ; నె
వ్వగచే నిండి మలీమసంబయి సదా భాసిల్లు నీ మద్యమున్
సుగతిన్ ద్రావుము ; చావు వచ్చిపడినన్ శోకింపఁగా బోకుమీ
దగ మృత్పానము నెల్లవారి కెపుడో త్రావించు సంభావ్యమై.