పుట:2015.393685.Umar-Kayyam.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

89

347

ప్రజలువచింతు రాసవముత్రాగుట మానుము, కష్టమెందె దీ
వజితలాంతతవేళ నరకాగ్నిఁ దపింతువటంచు నీవిధుల్
నిజములెగాని, యీకడుపునిండఁగ శీధువుద్రావి కైపునం
దెజరుపు ; రెండులోకములు దీనికిమించి శుభంబుఁ గూర్చునే!

348

నన్ను వియోగబాధ వ్యసనంబుననుంపఁ దలంచితో, భవ
త్సన్నిధి సంతసంబున నొసంగఁదలంచితొ, యేదిగూడ నే
విన్నపమున్ బొనర్పను ; ప్రవీణుఁడ నీవెటులుంచ నెంచితో
నన్నటులుంచు మెంతయునునాకదె శ్రేయము లోకనాయకా !

349

నీకు హితంబుచేకుఱిన నీదుప్రవీణతగా దొకింతయున్,
నీ కహితంబుచేకుఱిన నీదురదృష్టముగా దొకింతయున్
ప్రాటకమైనశాంతి, సహనంబునునేర్చి సుఖానఁ బుచ్చుమీ
లోకము మంచిచెడ్డ గతులు న్మనయత్నములోన లేవిలన్.

350

నేరకయిల్లు నిల్లుఁజననేరదు ; మంచికిఁ జెడ్డకున్ సదా
యోరిచి కాలమన్ ఫలకముంచి యదృష్టపుఁ బాచికల్ దగన్
గూరిచి, యెత్తువేసి, వగఁగూరక పన్నిదముంచి యేగతిన్
బారునొ యోడు గెల్పులనుబట్టి నటించుట కర్జమేరికిన్.