పుట:2015.393685.Umar-Kayyam.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"ఒఖిలీదస్" (Geomietry) లోన కఠినతరసమస్యలు ప్రస్తరించి చూపించెను.. "ఇల్మె తభీయాత్" (Chemistry).

"దర్బారయే హుక్మతుల్ ఖాలిఖ్" ఇది వేదాంతశాస్త్రము సంచీకరణ విషయముగలదు.

"రిసాలా" శారీరఆర్థికశాస్త్రము

"రిసలయెమౌనూమా" తర్కశాస్త్రము.

ఇట్టివే యెన్నియో కలవు. ఇవి యన్నియు నిప్పటికిని బ్రమాణ గ్రంథములుగ బండితులచేఁబరిగణించబడు చున్నవి. ప్రాశ్చాత్యులీ గ్రంథములన్నియుఁ తమభాషలలో తర్జుమా చేసికొనినారు.

ఈతని జీవితకాలములోఁగూడ నతనికి జగద్విఖ్యాతమైన యశస్సుండెడిది. నాఁటి చక్రవర్తులలోఁ బేరెన్నికగన్న షంఘల్ ముల్కుఖాఖాని సుల్తాన్ సంజీద్మున్నగువారీతిని కర్ధసింహాసన మిచ్చి గౌరవించుచుండిరని, పల్లకి దండి చేతితోతాకి బోయీలకెత్తుకొనుట కనుజ్ఞ నిచ్చుచుండిరని, నాఁటి ప్రసిద్ధచరిత్రకారులగు దౌలిర్ షాసమార్‌ఖంది. తారీఖుల్హూక్మ మొదలగు వారివలనఁ దెలియుచున్నది. నాఁటిసమకాలికులగు కవులు చరిత్రకారులగు "నిజామీ, ఉరూజీ" మున్నగు వారీతని పూజ్యపాదునిగ గ్రహించి పేర్కొనుచుండిరి. ఈతని కాగతానాగతజ్ఞానము గలదనుట కనేక నిదర్శనములు ప్రజల కగుపర్చు చుండెను. అవి యిం దుదాహరించుట గ్రంథవిస్తరమగును.

నంతచెప్పుటయందును అవధానము లొనరించుటయందును, తర్కవ్యాకరణాది జ్యోతిషవిషయములే కాక యెన్నియో కళలయం