పుట:2015.393685.Umar-Kayyam.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

ఉమర్ ఖయ్యామ్

329

సుమములపై వినూత్న హిమశోభలుమోదముఁగూర్చు చుండె ; నా
ప్రమదవనాంతసీమ జవరాలు మనోజ్ఞత నొప్పుచుండె ; నే
డమలవిలాసవైభవములందుము ; ఱేపటిమాట వీడు ; ని
న్న మరలిపోయె మేలని మన బున నెంచుము నిత్యతోషివై.

330

మదిరాపానవిమత్తచిత్తమె మహమ్మద్‌రాజ్య మంచెంచుకో
ముదితల్‌బాడెడుపాటలా "హసనెదావూదీ" యటం చెంచుకో
మది నానందరసాప్తినింపుమిదె సమ్యక్తత్త్వసంకేత సం
పదగా నెంచుము వచ్చిపోవుపదముల్ వర్జింపుమా యీపయిన్.

331

ఎంతకాలంబు నదిలోన నీవిధాన
ఱాలు విసరదు ? ఱాలను గుళ్ళయందుఁ
బూజచేసి హతాశునిఁబోలి పోదు ?
నేఁడు మద్యంబుమానిని గూడఁదలతు
నరక మేమిటి ? స్వర్గంబునాఁగ నేమి ?

332

జీవయాత్ర వేగంబుగా బోవుచుండె ;
నిందొక నిమేషమానంద మెసఁగెనేని
ధన్యమే ; చెలి ! పరులనిందలఁబనేని
సురను గొనిరమ్ము ! రాత్రియేయరుగుచుండె.