పుట:2015.393685.Umar-Kayyam.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

83

325

చెలఁగు వసంతకాల వనసీమల సోమరసంబు పాత్రలో
పలనిడి మాకొశంగఁగలభామిని యున్ననిజంబు స్వర్గ మేఁ
దలఁపఁ ; దలంతునేని శపథంబిదె శ్వాసముకంటె నీచుఁడం
చలతినిజూడు నేనిటులయాడుట కష్టముదోచు ధాత్రికిన్.

326

నెచ్చెలి ! స్వర్గమోయనుచు నీకడియాస యదేల ? స్వర్గమం
దచ్చర, లాసవంబు విభవాదునెయున్నవి వేఱులే ; వవే
యిచ్చటనున్న వింకఁగఱవే ? త్రిగంబులఁ జూపనేర్తువే
వెచ్చని కల్లు, కాంతకును వేఱుగ వైభవమేది యున్నదో.

327

చెలి ! నాకామధురాసవంబిడుము ; నన్‌సృష్టించినాతండు నా
తలపై మద్యముఁ ద్రావుచున్ బ్రణయకాంతాసంగతిన్ గూడి ని
చ్చలు భోగింపఁగవ్రాసినాఁ, డవియుమాసాన్నిధ్యమున్‌బొందె ; మీ
తలపైవ్రాసిన స్వర్గకాంత సుర వ్యర్థం బర్థిఁ జింతింపఁగన్.

328

హయమో గాయనియో, సురాకలశమోయబ్జాక్షియో, వన్యసం
చయమో కోరుము ; స్వర్గమన్న దొకసాక్షాద్వస్తువేయైన ని
శ్చయ మీబోగమే వేఱులేదట మదిన్‌సందేహమున్ వీడి యీ
నియతిన్ నమ్ముము ; చల్లబడ్డనరకాగ్నిన్ రేఁపఁగాబోకుమీ !