పుట:2015.393685.Umar-Kayyam.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

ఉమర్ ఖయ్యామ్

322

ఱే పనునది నీయదిగా
దీప్రొద్దే నీది ; నిన్ననే చింత మదిన్
బాపుము ; విలువగుజీవిత
మవెపాటిది ? వ్యర్థపుచ్చెదే వెంగలినై ?


323

నన్నుఁబుట్టించిననాఱేఁడు నుదుటిపైఁ
             బంకులుగాఁ దీర్చి పట్టి పట్టి
నను నరకాగ్నికి జనుమని వ్రాసెనో ?
             స్వర్గంబునకుఁబోవ వ్రాసినాఁడొ ?
నే నించుకేనియునెఱుఁగను ; గావున
             నా కావిచారమెన్నఁటికి లేదు ;
మద్యంబు, మానిని, మంజులగానంబు,
             వనవిహారంబు నాఁదనరు నాల్గు
మాకుఁ బ్రత్యేకముగఁ గూర్చి నీకు నిష్ట
మగు నగోచర మపవర్గమంటఁగట్ట
మాకు వగపేల ? వాదేల ? మాటలేల
మాకు రొక్కంబుతోఁ బని లోకమందు.


324

అరయన్ దేవవదూరతం బమరబ్రహ్మానందమం చండ్రు మీ
రరయన్ మద్యము ద్రావుటేనిజము బ్రహ్మానందమం చందు నే
నరతిన్ లభ్యమునాది ; మీదివియలభ్యంబౌట వీడ్కొండు ; దు
ర్భరభేరీనినదంబు దూరమునకున్ శ్రావ్యంబుగా నుండదే !