పుట:2015.393685.Umar-Kayyam.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉమర్ ఖయ్యామ్

77

302

ఏను మహాఘపుంజములనెన్నిటినో పొనరించినాఁడ ; నా
ప్రాణము, మేను వానికయ యాహుతియయ్యెడుఁగాన యీశ్వరా !
నీ నయభక్తి సల్పుచును, నిన్బతిమాలుచు నాదు పాపముల్
మానుప వేడుచుంటి ననుమానముమాని దయన్ దలంపుమా !

303

సి కరాణాబ్ధిమ్రోల నఘనిర్ఘరికిన్ వగపొందఁబోను ; దు
ర్వ్యాకుల జీవయాత్రను భవత్కరుణార్థము చేతనుండఁగా
నాకు భయంబు లేదు ; భవనాశ ! భవత్కృప నన్ను శుద్ధుఁగాఁ
గైకొని లేపెనేని నఘగాడ కళంకము నే గణింతునే ?

304

ఈవు దలంపకేను బ్రజకిందు భయంపడుచుందు ; నీ
జీవముపోవునంచు వకజెందను ; చావననేమి లెక్క ? కా
నీ వగ యొక్కమాటకెసుమీ గల దీబ్రతుకెల్ల ఘోర పా
పావిలమౌను గాని చనదయ్యెను బుణ్యమునం దొకప్పుడున్.

305

మధువు గొన హస్తములపైని, మద్యశాల
కరుగు పదములపైని, బద్దాసువుపయి
దగ్ధహృదయంబుపై దుఃఖతతిని మునిఁగి
యున్న నాపైని గరుణింపుమోయి దేవ !