పుట:2015.393685.Umar-Kayyam.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

ఉమర్ ఖయ్యామ్

298

సురనే త్రావు ; ముపాసనల్, చదువులున్ శోబిల్ల రక్షింప ; వీ
సుర నజ్ఞానవశావఁ ద్రావరు ప్రజల్‌క్షోణిన్ బశుప్రాయులై ;
పరమాప్తుం డలుగంగఁ బోవఁ డఘముల్ పాటింపఁ డీలోకులన్
గరుణన్ ధన్యులఁజేసి ప్రోచును జగత్కల్యాణ సంధాతయై.

299

కరుణామయుఁ డగు పరమే
శ్వరుఁడు నినున్ బ్రోచుఁ ; బాపభయమిఁకఁ గలదే
దురితుఁడ, మత్తుఁడ నైనను
గరుణించును నీదు నెమ్ముకల లయవేళన్.

300

ఏను ప్రపంచపాపముల కెల్ల నిదానము నైన, నీదయా
స్థానము నన్నుఁ బూతచరితాత్మునిఁ జేయు నటంచు నమ్మెదన్ ;
దీనుల నీవు ప్రోతునని తెల్పితివే యిఁక నింతకంటె నా
దీనత యేని యున్నది ? త్వదీయ దయన్ గురిపింపు మీశ్వరా !

301

ఏనరిషట్కమున్ దెలువనెంచిన, నామతి యేవొ లోపముల్
పూనియొనర్చు మాన ; దఘపుంజము నీదయచేతఁ బాపి నా
పైని ననుగ్రహింపు మభవా ! యటులైనను నీదు మ్రోలనే
నే నొనరించినాఁడ నఘ మేగతి లేదన నేర్తు సిగ్గగున్.