పుట:2015.393685.Umar-Kayyam.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉమర్ ఖయ్యామ్

75

295

ఓ పరమాత్మ ! నీవు సకలోర్విఁ బజాహృదయం బెఱుంగఁగా
నోపుదు, వెల్ల వారి కలుసౌఘముఁ బాపెదు ; వేఁడుకొన్న నా
పాపముఁ బాపవే ? పరమపావన ! నిన్ బ్రతిమాలుకొందు ; నో
పాపవిమోచనా ! కలుషభంజన ! నామన వాలకింపుమా !

296

మధుప్రబోధము

ఏను సురాపణంబునకు నేగఁ బ్రమత్తుఁడు వృద్ధుఁ డొక్కఁడా
జానుభుజుండు మద్యకలశంబును మూపునఁ దాల్చి రాఁగ "నో
మాని ! యిదేమియీశ్వరుఁడుమాన్పునెయీయఘ"మన్ననాతఁడున్
"దీనిని ద్రావి శాంతిలు మిదే హరిదత్తకృపారసం? బనెన్.

297

ఏనొనర్చిన దొక్కటేని పుణ్యంబున్న
             క్షమియించు పదివేలు కలుషములను
ఏను ప్రజాపీడ నేదే నొనర్చిన
             మన్నించు దాని నీమహిమవలన
క్రోధాగ్ని తమసావరోధ ఝంఝామారు
             తంబును రగులింపఁ దలఁపఁబోకు
ఆ మహమ్మద్ రసూలల్లా పదాబ్జ ధూ
             సరులము మము దేవ కరుణజూపు.