పుట:2015.393685.Umar-Kayyam.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

ఉమర్ ఖయ్యామ్

291

ఉద్ధానదినమునన్ హరి
కృద్ధుండై యున్నఁ బుణ్యు లేఁగుదు రటకున్
సిద్ధం బాగతిఁ ; దుదకు స
మద్ధ మహానంద మగుచు నేర్పడు నీకున్.

292

ఆదినమందుఁ బుణ్యులు మహాఫల మందినఁ బాపినైన నా
కేదియొ కొంత గల్గునటు లేదియుఁ గాకయె యున్నఁబుణ్యులన్
బాదము లాశ్రయించి యపవర్గము నొందెద ; నొక్కవేళ నే
నే దృఢపుణ్యశాలి నగుదేని మహాత్ముడ నౌదునేగదా.

293

పుడమిఁ ద్వదీయభాగ మగు భోగములంగొని సంతసంబు చొ
ప్పడ మధుపాన పాత్రలఁ గరంబునఁ గైకొని కూరుచుండు ; మీ
చెడుగున, కాయుపాసనకుఁ జెల్వము గూర్చుఁ బరాత్పరేశుఁ ; డే
యెడ భవదీప్సితం బనుభవింపుము చిక్కిన వన్నిదక్కఁగన్.

294

నే జపమాలఁద్రిప్పకయె నింద్యచరిత్రుఁడ నైనఁ, బాపమే
యోజన జేయుచుండినను నోపరమాత్మ ! త్వదీయప్రేమకున్
భాజనుఁడౌదు ; నేమనిన భవ్యుని నిన్నొకఁడంచు నాత్మలోఁ
బూజయొనర్తు, రెండనుచుఁ బోల్పను నిన్ను యథార్థమీశ్వరా !