పుట:2015.393685.Umar-Kayyam.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

ఉమర్ ఖయ్యామ్

283

ఈశ్వరుఁడు

పరమాప్తుండు, జగన్నియంత, కరుణావారాశి ; మర్త్యుండు త
త్కరుణారాశిని బాపతాప మలినాంధఃపుంజముల్ వాయు ; నీ
సుర వేద్రావు వసంతవానరములన్ శుష్కించి ధ్యానించి యీ
శ్వరుఁ బొందన్ దలపోయ కాతఁడు తపస్సంకల్పముల్ గోరునే !

284

ఓ "వును" రేల పాపమున కూరక చింత యొనర్చెదీవు ? నీ
భావము తల్లడిల్లినను వచ్చెడు దున్నదె లేశమైన నీ
భూవలయంబునన్ గలుషమున్ బొనరింపనిచో శరణ్య మా
దేవుఁ డొసంగు నెవ్వనికి ? దీనులనేగద యాతఁ డోమెడిన్.

285

మావలనన్ సురాలయము మంజువిలాసము లుల్ల సిల్లు ; మా
భాపము పాపకూపమయి పర్వుచునున్నది ; మేము పాపమే
కేవల మాచరింపుచును గీడ్పడకుండిన, దేవుఁ డెవ్వనిన్
గావఁగ వచ్చు ? వాని కరుణన్ వెలిబుచ్చఁగనైతి నీగతిన్.

286

ఓ కరుణాళు ! నీవు కరుణోదధివై మముబోటి పాపులన్
గైకొని గాచుటే కరుణ గావున స్వర్గమునందుఁ బాపులన్
జేకొనవేమి ? నీ తపముచేతనె ముక్తి యొసంగెదేని న
య్యో ! కరుణాళుఁ డన్‌బిరుద ముండునె పాపులఁ గావకుండినన్.