పుట:2015.393685.Umar-Kayyam.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

65

256

ఎన్నాళ్ళు వెతలఁ బడియెద
వెన్నా ళ్ళీజగతి దుఃఖమెద నేర్చెద వా
పన్నుఁడ వై సురఁ ద్రావు మ
ఖిన్నుఁడవై బ్రతుకు బ్రతుకు గెడయక ముందే.

257

క్షణికంబైనది ధాత్రి ; నే నొక క్షణాకాంక్షన్ బ్రవర్తింప నుం
టిని ; యిందెన్నిముహూర్తముల్ గలుగు నేఁడే వేడ్కవెచ్చింపఁ జె
ల్లును బ్రాణంబులు నున్న వింక నిటుపై లోకం బవిశ్వాసి యె
వ్వనివెంటన్ జన దీముహూర్తమె మహాభాగ్యంబుగా నెంచెదన్.

258

రహస్యము

అల్పులకు రహస్యంబెల్లఁ దెల్పరాదు
అనధికారులు బోధ కనర్హులు గద !
అవయవంబులలో ముఖ్యమైన కన్ను
కంటిఱెప్పలలో దాఁచు చుంట లేదె ?

259

ఈ మహాగ్రంథమున జగతీరహస్య
మెల్లఁ గలదు గాని ప్రజ గ్రహింపలేదు
ప్రజలు వ్యర్థు లియ్యది విన్నఁ బ్రాణహాని
గాన మేమును నిది చెప్ప మానినాము.