పుట:2015.393685.Umar-Kayyam.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

63

248

ఆనందింపవొ యీయుషస్సమయసంధ్యారాగ మీక్షించి లె
మ్మో నీలాలక ! రాత్రి ద్రావఁగను బై నున్నట్టి మద్యంబు తె
మ్మీ నానోటను బోయు ; మీగడియ యెంతేవేడ్కఁ జేకూర్పుమీ
యానం దాఁటిన మేలు బూడిదయి పోనై యుంటి మత్యంతమున్.

249

ఆ కలశమందుఁ గల మద్యమంత వలవ
దొక్కచషకంబు నాకును నొక్కచషక
మీవుఁ గొను మంతె చాలును ; నీవు నేను
వసుధఁ గలశంబులుగఁ జేయఁబడక మున్నె.

250

సామజయాన ! యీదిన ముషస్సును, సంధ్యల వ్యర్ధపుచ్చఁబో;
కా మధు విందుఁ దెమ్ము ; క్షణమైనను మాకిడ నాలసింప ; కీ
యామని గ్రీష్మకాలముల "కైకుసురూ, జమషీదు" లెందఱో
భూమిని నిర్గమించి రివిపోవుచు వచ్చుచు నుండులోపలన్.

251

ఇల కృతజ్ఞతఁ జూపెనే యెవరికైన ?
నెందఱొ పరీక్ష చేసియే డిందినారు
గాన సాగినచోఁ బ్రతిక్షణముఁ గూడ
మద్యమును, మానినిని వీడి మసలఁజనదు.