పుట:2015.393685.Umar-Kayyam.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

ఉమర్ ఖయ్యామ్

244

అలరు వసంతకాల పవనాహతిఁ బువ్వులకొంగు విచ్చె ' "బుల్
బులు: చని సంతసించెను బ్రపుల్లసుమాళినిగాంచి కాంచి ; యీ
యలరుల మాడ్చు గ్రీష్మము లయాకృతి ; నీగతె నీకు, నాకు నె
చ్చెలి ! సురఁదెమ్ము త్రావుదము జీవములూడిన వేడ్కలున్నవే ?

245

ఓ వెలదీ ! సుగంధరుచిరోజ్జ్వల శీధురసంబుఁదెమ్మ ! యీ
జీవవివాద వాంఛలఁ ద్యజించెద మద్యఘటంబు ని మ్మదే
యీవును, నేను, గాలహతి నీల్గి ఘటంబులు కాకపూర్వమే
త్రావి పలాశపాన్పుల ముదంబునఁ బుత్తము శేషకాలమున్.

246

ఓ లతాంగి ! పువ్వులు పూచి యొలయుచుండె
వ్రతసమాధుల వర్జించి హితసమాధి
వననదీతటముల మద్యపానరతులఁ
దేలుమీ ! మిత్తి నెత్తిపైఁ గ్రాలు నదిగొ !

247

ఱాతిలో నగ్ని డాఁగినరీతి దాఁగి
యున్న నిను నార్చు మృత్యు వాయుదకమట్లు
వసుధ మృత్పిండ మని పాట పాడ వేమి ?
ప్రాణ మొక గాలీ ; చెలి ! సురఁద్రావరాదె ?