పుట:2015.393685.Umar-Kayyam.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

59

232

అనలమురీతి నాకసమునందుఁ జరించిన, మంచినీటి తీ
రునఁ బరిశుభ్రతన్ గలిగి రూఢిఁ దనర్చిన నొక్కనాఁడు బూ
దిన మనపోక తప్ప ; దిల దేహము బూడిద గాన నీ జగం
బనిలమురీతిఁ జేయును బ్రయాణము శీధువు నిమ్ము త్రావెదన్.

233

మమ్ము జగంబు వాగుడుల మాయల దింపకమున్నె యొండొరుల్
కమ్మని శీధువానెదముగాక ! మహామరణంబు వచ్చి మా
ఱొమ్మును జీల్చుచుండినను రోసి జలాంజలిఁ దెచ్చి పోయు మం
చెమ్మెయిఁ గోర మెవ్వరిని ; నీస్సితసిద్ధిని విశ్వసింపుచున్.

234

ఎన్నాళ్ళీగతి హేతువాదముల నెంతే నమ్మి జీవింతు మా
పన్నుల్ వోలేశతాబ్దముల్ భ్రమఁ దృణప్రాయంబుగాఁబోయెనో
యన్నా శీధువుఁదెమ్ము త్రావుదము నిత్యానందమున్ గూర్చు ; ని
ట్లెన్నాళ్లున్నఁ గూలాలునింటఁ జను మన్నే యౌదు మూహించినన్.

235

ఈ జన్మవెనుక ధరపై
రాఁజన దిఁక జన్మ బంధురాజిఁ గలియ నిం
దీజన్మ మహాభాగ్యము
గాఁ జూడుము తిరిగి దీని గానఁగ నగునే.