పుట:2015.393685.Umar-Kayyam.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

55

216

కాలము పోవుచున్నది ; సుఖంబుగఁబుచ్చుము ; ప్రాణిప్రాణ మే
వేళను బోరుతో విసిఁగి వేసరుచుండు ; సతంబు ధాత్రిపైఁ
గ్రాలు ప్రజాశిరఃకలశరాజి యొకానొకనాఁడు భిన్నమై
రాలి కులాలుపాదయుగళంబుయి ద్రొక్కెడు మట్టియౌఁ జుమీ.

217

ఆనందింపుము నేఁడె ; దుఃఖములు రానైయున్న వీపైని ; నీ
మేనున్ మిత్తికిఁ జిక్కి మృత్తికయగున్ మేల్కొన్నరెన్నాళ్ళె నీ
వానందించుచు నాసవంబుఁగొని దుఃఖాసక్తి వర్జింపు మీ
ప్రాణుల్ నిక్క మటన్న వారలకె దుఃఖాసక్తి నీకేటికిన్ ?

218

లెమ్ము ! ప్రభాతకాలము చెలీ ! యిది ; మద్యము గాజుపాత్రతోఁ
దెమ్ము మనోహరాకృతినిదీర్చి ; ధరిత్రి వినాశనాలయం
బిమ్మెయి నీకు నిందు సుర నిచ్చుట చాల ననుగ్రహించియే
సు మ్మిది వ్యర్థపుచ్చునెడఁ జూడవు నీ విఁక నీవిలాసముల్.

219

కలశము నిండ మద్యమును గైకొని రమ్ము ; సదా స్వతంత్రతల్
గలిగినవారి కీ మధువు గౌరవమిత్రము ; మర్త్యులెల్ల మృ
త్కలితులు ; తీవ్రమారుతము కైవడి నాయువు పోవుచుండఁగా
దెలియవె నెచ్చెలీ ! సురను దెమ్మిఁక నాఁగము వేళ దాఁటినన్.