పుట:2015.393685.Umar-Kayyam.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తక్కినవారికి సమానముగాఁబంచవలె'నని యొక ప్రమాణపత్రము వ్రాయించెను. కొంతకాలము గడచినతరువాత నిజాముల్‌ముల్కు బాగ్దాదు పరిపాలించుచున్న మలికాసల్జూఖీచక్రవర్తులయొద్ద బ్రధాన మంత్రిగానేర్పడియెను. వానియొద్ద కొకనాఁడు ఎక్కడికో పోవుచు మార్గశ్రముఁడై ఉమర్‌ఖయ్యాం వెళ్ళి దర్శించెను. నిజాముల్ముల్కు చూచిచాలగౌరవించి నీకేమికావలెనని కోరెను. నాకేమియునగత్యము లేదనిచెప్పి వెళ్ళిపోఁజూచెను. కానినిజాముల్‌ముల్కు 'మనము చదువుకొను దినములలో నొక ప్రమాణపత్రము వ్రాసికొంటిమి. నీకు జ్ఞాపకము లేదా' యని యుగ్గడించి నీవు 'నావెంట రావలెను. నాయేలికతోఁజెప్పి నిన్ను నాయంతవానిగఁజేయుదును' అని మిక్కిలిప్రార్థించెను. కాని ఉమర్‌ఖయ్యామా మాటలకునవ్వి,

"ఎకనానె బదోరోజ గరషవద్ హాసిలెమర్ద
బరకూజషికిస్తాదమె అబెసర్ద
మమూరక సేదిగర్ చరాబాయెద్ బూద్
తాఖిద్మతె చూఖుదీచరబాయెద్ కర్ద."

అనగా,

ఉ. రెండుదినాలకైన నొక రేయొకరొట్టె లభించెనేని, నో
    రెండినవేళ నింతజల మిచ్చెడు పెంకు లభించెనేని నే
    నొండొరు వేఁడి, వాని కొలువుండను నాగతి మానవుండె భూ
    పుండును వాని గొల్పుచును బొట్టను నింపుకొనంగఁ బోదు నే.

    "ఎకజౌగమె అయ్యాంసదారేం ఖుషేం
    గర్‌చాష్త బువద్ షాం సదారేం ఖుషేం