పుట:2015.392383.Kavi-Kokila.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాంకము] సీతావనవాసము 89

దములు సలుపుచుండిరి. ఆమాటలు నాకు స్పష్టముగ వినఁబడలేదు.

సీత : మాండవ్యా, కుశలవుల కేమియాపద గలుగదు గదా ? ఒక్క క్షణముసేపు విలంబన మెక్కయుగముగఁ దోఁచుచున్నది.

మాండ : అమ్మా, వా రిరువురు వాదముల నూహింప, సేనాధిపతి యశ్వమును విడువుమనియుఁ గుశుఁడు విడువననియుఁ అన్యోన్యము తర్కించుకొనుచుండినట్లు కనుపట్టినది.

సీత : [నిట్టూర్పుతో] అయ్యో! బాలుఁడెక్కడ, యజ్ఞాశ్వమును బట్టుటెక్కడ? ఇంత నేరమి దగునా? మాండవ్యా, కుశుఁడు అశ్వమును విడువలేదా?

మాండ : ప్రాణమునైన వదలి పెట్టునేమోగాని, వారువమును మాత్రము విడువఁడు.

సీత : అయ్యో! నీవైన బుద్ధి సెప్పవా?

మాండ : నే సమీపమున నుండినఁగదా -

సీత : తరువాత ?

మాండ : సేనానియును గుశుఁడును మరుప్రదేశమున కరిగిరి.

సీత : వా రచ్చటఁ బోరుసల్పిరా ?

మాండ : వేఱు చెప్పవలయునా ?

సీత : అకటా! యెంతప్రమాద మెంతప్రమాదము !

                    పోరులను నారితేరిన వీరులేడ ?
                    బాణ విన్యాస మెఱుఁగని బాలురేడ ?
                    శౌర్యసాహస సాధ్యంబు సమరమేడ ?
                    యిన్ని తలపోసి శంకించు హృదయ మకట !

మాండ : అమ్మా, శంకింపవలదు, కుశుని సంగర కళాకౌశలము వీక్షిం