పుట:2015.392383.Kavi-Kokila.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. కవికోకిల గ్రంథావళి [ప్రథమాంకము

దండ కాటవి రాముఁడు నా ముక్కు - సెవులు గోయింపఁ గినిసి రావణునిం బురికొల్పి సీతఁ జెరఁబెట్టించితిననియుఁ దన్మూలంబున రాక్షస కుల వినాశం బయ్యెననియు దైత్యాంగనలు నన్ను దూఱుచుందురు. ఆ యంగ వైకల్య కథావిధాన మొకవంకయు అసురకులవినాశ సంతాపవహ్ని వేఱొకవంకయు నాచిత్తము దరికొల్పుచున్నది. దైత్యకుల క్షయమునకు నేనా హేతుభూతురాలను ? - కాను; కాను; ముమ్మాటికిం గాను. సురారికుల కలంకుఁడు ప్రతిపక్షభూషణుఁడు స్వపక్షదూషణుఁడు ఆవిభీషణుఁడే కారకుఁడు ఆరాక్షసాధముఁడే నిజరాజ్య రహస్యంబులఁ బరుల కెఱింగించి కులాధ:పాతంబునకుఁ దోడ్పడియె. ఓరీ విభీషణా, నీ యొక్కని యవివేకంబున దైతేయసముదాయమున కంతటికి నాపదవాటిల్లెఁగదా. నీ మౌఢ్యమునఁ గదా లంకాపురలక్ష్మీ భగ్నావశేషగోపురమిషంబునఁ జేతులు బారచాఁపి రణనిహత భర్తృకా విలాపంబుల వాపోవుచున్నది. ఛీ ! ఆ దైత్యకులాంగారుని నామమేల స్మరించితిని ? అట్టి పంద పవిత్రమగు మాకులమున జన్మించి వంశపారంపర్యాగత గౌరవంబు నేల నేలపా లొనరించె ?

                   అరిపాదంబులు పట్టి దాసుఁడయి, దైత్యవ్రాతముం బోరిలోఁ
                   బరిమార్పించి, సహోదరాదులమృతిన్ భాగ్యంబుగా నెంచు ము
                   ష్కరుఁడై నేఁడు విభీషణాసురుఁడు లంకరాజ్య మేలంగ సి
                   గ్గఱి యిచ్చో నివసింపఁగావలెనె యింక న్నీచపుం గూటికిన్ ?

వనంబునఁ గందమూలఫలాదులు లేవా యీపాడుపొట్ట నించికొనుటకు ? ఆఁడుదాన వయ్యు రాక్షసకులంబున దశకంఠునకు సోదరినై జనియింప లేదా ? [ఉల్కిపడి యాకసమువంకఁజూచి] ఆహా ! రణనిహతులైన దైతేయవీరులు నాకన్నులకుఁ బొడకట్టుచున్నారు. పోటుగంటులనుండి దొరంగు ఒక్కొక రక్తపూరమును ఒక్కొక నాలుకగ ప్రతిహింసా పరాయణత్వ