పుట:2015.392383.Kavi-Kokila.pdf/89

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86 కవికోకిల గ్రంథావళి [సప్తమాంకము

లక్ష్మ : [స్వగతము] వినవిన నీబాలకుని చతురోక్తు లసహ్యములగుచున్నవి. [ప్రకాశముగ] ఓయీ, నీవెవ్వని సవనాశ్వమును బంధించితివో యా లోకైక వీరుని క్రోధాగ్ని శిఖలయం దేల శలభమువలె న్రుగ్దాదవు ? ఆ రామచంద్ర నరేంద్రున యతిలోకశూరత్వము నీకుఁ దెలియక యింతటి సాహసకార్య మొనరించితివి కాఁబోలు?

                    కౌశికయజ్ఞంబుఁ గావంగ నేఁగుచో
                             మార్కొన్న తాటక మదమడంచె;
           కుశు : ఆఁడుదానిని బట్టి యఱచి కూయఁగఁ జంప
                             నదియె శూరత్వము చనగ వలెనె?
           లక్ష్మ : క్రతువాటి శోణిత క్రవ్యముల్ చల్లు మా
                             రీచ సుబాహుల పీచమడఁచె;
           కుశు : పండ్లు గడ్డలుమెక్కు బక్కతపసుల నేచు
                             పిరికి దైత్యులఁగూల్ప వీరుఁడగునె ?
          లక్ష్మ : ధరణీసుతా స్వయంవరమున గిరిజేశు
                             బలువిల్లు డాకేలఁ బట్టివిఱిచె;
          కుశు : చిరకాలముంటఁ బుచ్చినవిల్లు విఱిచిన
                             దానికే చంకలు తట్టవలెనె ?
          లక్ష్మ : అతుల విక్రమశాలి నమరేశు సుతువాలి
                             నొక్క బాణంబున నుక్కడంచె;
          కుశు : ఇరువురు పోరాడునెడఁ బొంచి యొక్కని
                             మఱుగుగాఁ దెగటార్ప మానుషంబె ?