పుట:2015.392383.Kavi-Kokila.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78 కవికోకిల గ్రంథావళి [షష్ఠాంకము

లవు : అన్నా, మనము పోయిచూతము.

కుశు : మాండవ్యా, ఆ గుఱ్ఱ మెచ్చటనున్నది ?

మాండ : కళ్యాణ సరోవరప్రాంతమునఁ బచ్చికబయల మేయుచున్నది.

లవు : పోవుదమురండు.

[అందఱు నిష్క్రమింతురు.]

[తెఱయెత్తఁబడును. గుఱ్ఱము కనఁబడును.]

కుశు : ఆహా ! ఈవారువమెంత తీరుగానున్నది !

మాండ : [దూరమునుండి] కుశా, యొంటిగ దగ్గఱకుఁబోకుము. అది కఱచు నేమొ.

లవు : ఈగుఱ్ఱముపై స్వారిచేసిన నెట్లుండునో? [డగ్గఱి] అన్నా, అదిగో బంగారు పట్ట మోమున వ్రేలాడుచున్నది.

కుశు : [మొగముపట్ట తీసికొనిచూచి] దీనిపై రత్నాక్షరములు గూడ మెఱయుచున్నవి.

మాండ : [స్వగతము] గుఱ్ఱమునకు కఱచుస్వభావము లేదుకాఁబోలు ! [మెల్లగ డగ్గఱును]

కుశు : [ముఖపట్టము పరికించి]

                     పదితలల రావణాసురు
                     మెదిపిన శ్రీరాముఁ డశ్వమేధము సేయన్
                     వదలెను హయమును; వీరుల్
                     పొదలినఁ గట్టుండు; లేక, మోడ్చుఁడు కరముల్.

ఏమేమీ ? శ్రీరాముఁ డశ్వమేధ మొనరింపనున్నాఁడఁట ! ఆతనికన్న