పుట:2015.392383.Kavi-Kokila.pdf/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70 కవికోకిల గ్రంథావళి [షష్ఠాంకము

[నేపథ్యమున]

తమ్ముఁడా, రమ్ము రమ్ము.

లవు : [కౌఁగిలి విడిపించుకొని] అన్నయ్య యెందుకో పిలుచుచున్నాఁడు.

[నిష్క్రమించును.]

సీత : అక్కటా ! నాముద్దుకొమరులు ఈ యజ్ఞాతవాసకష్టము లెన్ని దినము లనుభవింతురు ? ఈబిడ్డల ముద్దుమాటలు వినిన ఆర్యపుత్రుఁ డెట్లు సంతసించియుండునోగదా?

                     జనకుఁడు గని మోదింపని
                     తనయుల మృదుభాషణములు ధైర్యోద్ధతులున్
                     దనరియు వ్యర్థంబులు ని
                     ర్జనవనమునఁ బూచియున్న ప్రసవము లటులన్.

[యవనిక జాఱును.]

________

చతుర్థ స్థలము : అడవి.

________

[యజ్ఞదత్తుఁడు ప్రవేశించును]

యజ్ఞ : సవనమన్నసంబరమునఁ గష్టముల గుర్తెఱుంగక యీయుద్యోగమున కొప్పుకొంటిని. నడచినడచి నాపాదములు పుండ్లయినవి. ఏపుట్టలోనో యేపొదలోనో గుక్కిరిమిక్కిరి మనకుండ ముక్కుపట్టుకొని యెన్నడో ప్రాణముపోయిన పీనుఁగులవలె బిఱ్ఱబిగిసికొని కూర్చుండియున్న వగ్గుతాపసుల