పుట:2015.392383.Kavi-Kokila.pdf/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము] సీతావనవాసము 65

మునిబాలురు : [భయపడుదురు.]

లవు : సానందా, యీబుజ్జమ్మను తీసికొని మేముగూడ ఆశ్రమానికి వచ్చెదము.

సానం : మీరు చచ్చునదిగాక మమ్ములనుగూడ చంపుటకా ?

మాండ : సానందా, నాకు భయమెత్తుచున్నది. మనము వీరికన్న ముందుగ పరుగెత్తుదము.

కుశు : మాండవ్యా, భయపడకండి. ఇవి పసిపాపలవంటివి. మనల నేమిచేయవు.

లవు : [నవ్వుచు సింగపుఁగొదమను మునిబాలురపై విసరుచు] ఇదిగో! సింగపుకూన, వదలిపెట్టిన మిమ్ము కఱచి చంపును.

మునిబాలురు : అయ్యో! చచ్చితిమి - చచ్చితిమి.

లవు : అభ్భా ! యెంత మహిమావంతులురా వీళ్ళు! చచ్చి మరల బ్రతికినారు.

సానం : లవా, మీదుండగములు తల్లితోఁజెప్పి మిమ్ములఁ గొట్టించెదము.

లవు : ఏమీ కొట్టించెదరా ? - [సింగపుఁగొదమను చంకఁబెట్టుకొని సానందుని దగ్గఱకుఁ బోవును]

సానం : [వెనుకకుఁదగ్గుచు] అయ్యో! అక్కడనే యుండుము. మమ్ము సింగపుఁగొదమచేఁ గఱిపింపకుము. బ్రాహ్మణ హత్యా పాతకము చుట్టుకొనును.

కుశు : [స్వగతము] మునిబాలకు లెంత పిఱికివారు!

మాండ : లవా, యొకసింహముండినట్లు మఱియొకసింహ ముండదు సుమా. నీమురిపెము గిరిపెము వెళ్ళివచ్చును.

లవు : [చిఱునవ్వుతో] అవునవును ! ఉండవు; కొన్ని ఆఁడువి కొన్ని మొగవి; కొన్ని చిన్నవి; కొన్ని పెద్దవి.