పుట:2015.392383.Kavi-Kokila.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64 కవికోకిల గ్రంథావళి [షష్ఠాంకము

వేచియున్నారు.

వాల్మీ : ఇదిగో! వచ్చుచున్నాను.

[నిష్క్రమించును.]

________

ద్వితీయ స్థలము : అడవి.

________

[మునిబాలురు ప్రవేశింతురు]

మాండవ్యుఁడు : కుశలవు లింతలో నెట్లుపోయిరి?

సానందుఁడు : అయ్యయ్యో -

మాండ : సానందా, యేమేమి?

సానం : వారుగో! కుశలవులు. కొదమనులాగివైచి తల్లిసింగమును పాలు పితుకుచున్నారు.

మాండ : అబ్బబ్బో! చచ్చిరి, చచ్చిరి. సింహము తిరిగిచూచి పండ్లికిలించుచున్నది. - అభ్భా, బిడ్డలుగారురా వీళ్ళు పిట్టపిడుగులు.

సానం : వీరుచచ్చిన మనపైకివచ్చును. మాండవ్యా, మనము ఆశ్రమమునకు వెళ్ళుదమురమ్ము.

[కుశలవులు ప్రవేశింతురు.]

లవు : [సింగపుఁగొదమను ముద్దుపెట్టుకొనుచు] బుజ్జమ్మా, మన మాడుకొందాము. నీకు తియ్యనిపండ్లు కోసిపెట్టెదను.

కుశు : [పెద్దసింగపు జూలుపట్టుకొని] సింహమా, పరుగెత్తుము. నీపై స్వారిచేసి చూచెదను.