పుట:2015.392383.Kavi-Kokila.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58 కవికోకిల గ్రంథావళి [పంచమాంకము

కసిదీఱును. [వికటహాస మొనరించి] ఆహా! నేఁడుగదా నేను దశకంఠునకు సహోదరినిగ వన్నె కెక్కుట ! నేఁడుగదా పితృలోకవాసులగు మా బందుమిత్రులు పరితృప్తులగుట! [ఆకాశమువంకఁగాంచి] దశకంఠా, మేఘనాధా, కుంభకర్ణాది రాక్షస వీరనాయకులారా,

                      సీతారామ విషాదబాష్ప సలిలాసేకంబు గావించి మీ
                      చేతంబుల్ రగిలించు శోకదహనార్చి న్నేఁడు చల్లార్చితిం;
                      బ్రీతిన్‌రాక్షస విక్రమోచిత సుఖశ్రేయంబుల బొంది చిం
                      తా తాపం బెడలించి శాంతిగొనుఁడీ నాకంబున న్నిచ్చలున్.

నేఁటికి నా గుండె బరువు తీఱినది. ఇదిగో! నాదీక్షాకంకణము విచ్చుచున్నాను. సంతోషరసపూరము నాహృదయతటముల నొరసికొని ప్రవహించుచున్నది. వేగమ పోయి యీయుదంతము యుద్ధనిహత భర్తృకలగు దైత్యాంగనల కెఱింగించి వారి చిత్తము లించుక చల్లఁబఱిచెదను.

[నిష్క్రమించును.]