పుట:2015.392383.Kavi-Kokila.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాంకము.

ప్రథమ స్థలము : అయోధ్య.

[శూర్పణఖ ప్రవేశించును.]

               శూర్ప: మాన్యులొనరింపనేరని మహితకార్య
                         మొక్క యల్పుఁడె యొడగూర్చు నొక్కవేళ;
                         రావణేంద్రజిదాది వీరప్రముఖులు
                         సలుపఁజాలని పని నాకు శక్యమయ్యె!

నే నాటిన యుక్తికల్పలతాబీజ మంకురించి, తీవలల్లుకొని, పూలు పూచి ఫలించినది. నా కల్పనాచాతుర్యము పరమావధి నొందినది. పల్లెత వేసము దాల్చి భద్రుఁడు వినునట్లు సీతను అపనిందలాడితిని. ఆముదుసలిగొడ్డు గంభీరముగఁ దలయూపుచుం బోయెను. ఒక్కగడియలో సీతాపవాదము వాడ వాడల మాఱుమ్రోగునటుల అమ్మలక్కలు నీటికివచ్చు బావులకడను పణ్య వీథులందును రచ్చకొట్టములదగ్గరను వివాదములు పెంచుచుంటిని. రామ రాజ్యముపై ప్రజలకును మునీశ్వరులకును ద్వేషబుద్ధి జనియించునటుల లవణాసురుని ప్రేరించి తపోవనములు ధ్వంసము గావించితిని.

ఆహా! నేఁటికి నా కపటనాటకము ముగిసినది. రామచంద్రుఁడు సీత నడవులకు వెడలించి తాను నేఁడు విరహవిహ్వలుఁడై శోకసాగరమునఁ బారము గానక ప్రాణసంశయావస్థలో నున్నాఁడు. గర్భ మంధరయగు సీతను ఒక్కపెట్టునఁ జంపిన నేమి లాభముగలదు? అడవులలోఁ బడరాని యిడుములు గుడిపించి క్రమక్రమముగ శోకానలంబున మాడ్చినఁగదా నా