పుట:2015.392383.Kavi-Kokila.pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50 కవికోకిల గ్రంథావళి [చతుర్థాంకము

శంకింపలేదు. ఇఁక శంకింపఁబోఁడు. అవివేకు లాడుకొను నపవాదములవలన రఘువంశకీర్తి కళంకితమౌనోయని వెఱచి తనహృదయమును బెఱికి వైచినటుల నిన్ను విడనాడెను.

సీత : [దు:ఖముతో] లక్ష్మణా, యిఁక నెప్పుడైన ప్రాణవల్లభుని దర్శించు నవసర మబ్బునా?

లక్ష్మ : [స్వగతము] ఈతల్లిని ఇట్టి యవస్థలో వీడి నేనెట్లు పోఁగలను?

సీత : జీవితేశ్వరా, ఇఁకనైన దిగంత కీర్తి విస్తారుఁడవుగమ్ము. నాకిఁక మరణమే శరణ్యము.

లక్ష్మ : [స్వగతము] అయ్యో! ఆత్మహత్య గావించుకొనునా? [ప్రకాశముగ] అమ్మా, నిలుకడమీఁదనైనఁ బ్రజలకు నిజము దెలియకుండునా?

సీత : మందభాగ్యనగు నాకుఁగూడ నిట్టి యాశావలంబనమా!

లక్ష్మ : [స్వగతము] కాఠిన్యమా, నామనము నావేశింపుము [ప్రకాశముగ]

                     దురితుఁడ బంధువిరక్తుఁడఁ
                     గరుణారహితుండఁ గ్రూరకర్మఠుఁడను ము
                     ష్కరత వనంబున నిన్విడి
                     పఱ తెంచఁగ నున్న కటికవాఁడను దల్లీ.

సీత : వత్సా, ఆత్మనిందవలదు. సార్వభౌముని శాసనము ఎల్లఱకు వలంఘనీయము. నీకు మార్గము మంగళకరమగుఁగాక !

లక్ష్మ : [స్వగతము]