పుట:2015.392383.Kavi-Kokila.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము] సీతావనవాసము 45

సీత : లక్ష్మణా, నాకేమియుం బనిలేదు. ఈమనోహరారణ్యవాటికఁ గాంచినంతనే నామన మానందపులకితమైనది. ఆహా! నాజీవిత కాలమంతయు నిచ్చోటనే గడపఁగలిగిన-

లక్ష్మ : [స్వగతము] హతవిధీ, ముందుగనే పలికించుచున్నావా?

సీత :

                    సరసఫలావనమ్ర తరుజాలము తియ్యని పండ్లనిచ్చు; ని
                    ర్ఘరములు నిర్మలాంబులిడుఁ; జల్లనినీడలొసంగుఁ బూఁబొదల్
                    మరుతము పుష్పసౌరభ సమంచితమై గమనప్రయాస ని
                    ష్ఠురతఁదొలంచు; మృత్యువిటఁ జొప్పడినంబ్రియమౌనులక్ష్మణా

ఆహా! ముందటిజన్మమున నేనేమి నోములునోచి ఆర్యపుత్రునివంటి యనుకూలపతిని గాంచితినో గదా. ఆ సరసుఁడు నామనోభీష్టమును అనుసరింపకున్న నాకీ ప్రకృతి రామణీయకము దర్శించు భాగ్య మబ్బియుండునా ?

లక్ష్మ : [స్వగతము] అయ్యో! అమాయికా ! [కన్నీరునించును]

సీత : [చకితయై] అన్నా లక్ష్మణా, నీవేల కన్నీరునించుచున్నావు? నిన్నటినుండియు నా చర్యలన్నియు శంకావహములుగ నున్నవి. ఊరక నిట్టూర్చుచుందువు. ఆలోచించుచుందువు. దీనవదనుఁడవై నేలచూచుచు నీలోన నీవే మాటాడికొందువు. హృదయము నొగిలించు శోకభారము నీమోమునఁ దొల కాడుచున్న ట్లున్నది. వత్సా, అందఱకు సేమమే గదా. నీవేల పలుకవు?

                     ప్రేమ మయుండు నావిభుఁడు, వీరకులా భరణుండు, సద్గుణ
                     స్తోముఁడు, శౌర్యధాముఁడు యశో ధవళీకృత దిక్తలుండు, స