పుట:2015.392383.Kavi-Kokila.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42 కవికోకిల గ్రంథావళి [చతుర్థాంకము

మందు వ్యత్యాసము గనుపట్టుచుండును. అకటా! మా కుటుంబమంతయు నెడతెగని శోకదవానలంబున మ్రగ్గుటకే జన్మించెనా ? ఒక్కరి నొసటనైనను మంచి వ్రాఁతవ్రాయఁడా ఆ విధాత?

                     వనవాసంబుగతించె, దానవుల దుర్వ్యాపారముల్మాసె, భా
                     మినిచేకూఱె, ధరాధిరాజ్యవిభవామేయాను భావంబునన్
                     మనమింపార సుఖంబులొందు చెటులో మాకాలముం బుచ్చనౌ
                     నని యోచింప నిటాయెఁ; జిత్రము లహా!యా దైవనిర్దేశముల్ !

తల్లీ విదేహరాజనందనీ, ఘోరదవానల జ్వాలలు తరుకోటరమున కంటుకొనుచుండ నేమియుందెలియక సుఖనిద్రా పరవశయైయున్న శారికా కుమారివలె శయనించియున్నావా ?

రామచంద్రా, యిట్టి ముగ్ధహృదయను ఇట్టి లోకపావనచరిత్రను నీవెట్లు విడనాడ సాహసించితివి ? ఎంత వేడికొన్నను వినవైతివే ! అకటా ! యీ పాపకార్యమొనరింప అగ్రజుఁడు నన్నే నియోగింపవలయునా ?

                     పదునాలుగేండ్లు వనముల
                     నొదవిన కష్టముల కోర్చి యున్నాఁడు దయా
                     స్పదచిత్తుఁడు గాఁడని యా
                     సదయుఁడు నన్నీ యఘంబు సలుపఁబనిచెనో!

కాకున్న నిట్టి నింద్యోద్యోగమున నన్నేల నియమించును ? కులిశాఘాత ప్రాయమగు రామసందేశము నీ కుసుమకోమల కెట్లెఱింగింతును ? ఎట్లెఱింగింపక యూరకుందును ? ఒకవంక నలంఘ్యమగు నగ్రజునియాజ్ఞ - వే ఱొకవంక మృదులమగు మానుషస్వభావము - నా యంతరాత్మను