పుట:2015.392383.Kavi-Kokila.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము

విష్కంభము

[మధురిక అటుతర్వాత ఒక నిమిషమునకు మందారిక ప్రవేశింతురు.]

మధురిక : ఇదిగో! అంత:పురపరిచారిక వస్తూవున్నది. దీని నడిగిన సమాచారమంతా తెలియును. ఒసే మందారికా, తలవంచుకొని యెక్కడికే బిరబిర పోతున్నావు ?

మందా : ఓహో! మధురికా.

మధు : నీవు రాణిగారితోగూడా మునికన్నెల చూడడానికి పోలేదా ?

మందా : ఆ - నాపని పోయినట్లే వుంది.

మధు : ఏమే గొంతుకు వురివేసుకో బొయ్యేదానివలె మాట్లాడుతున్నావు ? అంత:పురంలో నీకేమైనా చీవట్లు తగిలినవా ?

మందా : కాదేపిచ్చిదానా, మహారాజుగారివొల్లు జబ్బుసంగతి నీకు తెలియలేదా ?

మధు : ఏమో చూచాయగా విన్నాను. ఇప్పుడేమైన నెమ్మదిగా వున్నదా ?

మందా : మధురికా, యేలినవారికి జ్వరతమందము గలిగిందని రాజవైద్యుగులు చెప్పు కొనుచుండగా నేను రహస్యముగ విన్నాను; దేవిగాఱిని గుఱించి యేమేమొ కలువరిస్తున్నాఁడఁట మహారాజు ! రాజకులమంతా