పుట:2015.392383.Kavi-Kokila.pdf/330

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విన్నపము

ఇంతవఱకు నేను రచించిన నాటకములు రచనాకాల క్రమానుసారముగ ఈ సంపుటమున సమకూర్పఁబడినవి. చిత్రగుప్త సంవత్సరాది సంచికలో ప్రకటింపబడిన "కాంగ్రెస్ వాలా" అను ఏకాంక నాటకముగూడ ఇందు పునర్ముద్రణము గావింపఁ బడినది.

మోపూరు నివాసులును కళోపాసకులును కవితా రసజ్ఞులును నాకు మిత్రులును అగు

శ్రీయుత రేబాల సుబ్బరామిరెడ్డిగారు

ఒకనాఁడు ప్రస్తావ వశమున నిట్లనిరి:

"నీగ్రంథములు చెల్లా చెదరుగ నున్నవి. మాసపత్రికలలో ప్రకటింపబడిన కొన్ని కావ్యములు గ్రంథరూపమున వెలువడనే లేదు. తుదకు నీపుస్తకములు ఎచ్చట దొరకునోయను సంగతికూడ చాలమందికి తెలియదు. నీకృతులన్నియు ఒకే పుస్తకముగ నచ్చొత్తించిన బాగుగనుండును. నీ విష్టపడుదువేని అందులకు వలసిన యేర్ఫాటు కావించెదను."