కొండవీటి రాజ్యేందిర క్రుంకిపోయె
నకట ! దురదృష్టవశమున, నైననేమి?
నేఁడు సిరిగల ప్రతి రెడ్డివీడు కూడ
పండితులపాలిటికి "పిల్లకొండవీడు".
"జనకుని స్మృత్యర్థము నే
ననుకొంటిని నీదుకృతుల నచ్చొత్తింపన్
అనుమానమేల? నీవౌ
నా వోయీ" యన్నతీరు "లౌ" ననిపించెన్.
నీ రసికత, నీమైత్రియు,
నీరమ్యకళానుభూతి నిరతము శిల్ప
ప్రేరకమై నవకవితో
ద్దారకమై పెంపు చెందుతున్ బ్రియమిత్రా !
నేను నీవును సకలంబు నిశ్చయముగఁ
గాలవాహిని నొకనాఁడు గలయఁగలము;
కాని, రమ్యమైన యపూర్వ కావ్యసృష్టి
అమరతం గూర్చుఁ గర్తకు నాశ్రితునకు !
సిరికిందగిన వదాన్యత,
పరువము, లలితాభిరుచుల బలిసిన భావ
స్ఫురణము, భోగప్రీతియు
విరిసెను నీబ్రతుకుఁ దీవ విరులటు మిత్రా.
పుట:2015.392383.Kavi-Kokila.pdf/328
Jump to navigation
Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
