పుట:2015.392383.Kavi-Kokila.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాంగ్రెస్‌వాలా

వెంకటే! : ఏం? బెల్లంకొట్టిన ఱాయాల ఊరికే కూసోనుండావు పలక్కుండా? అట్లయితే నువ్వే చావు. నేపోతాను. [తన బిడ్డను చంక పెట్టుకొనును]

రంగా : ఒన్-టు-త్రీ-(one-two-three)

భార్య : నా ఊపిరిగూడా పోసుకొని నువ్వే నూరేళ్ళు బతుకు

వెంకటే : నేనేం అంత పనికిమాలినవాణ్ణనుకొన్నావా యేం నీమతిలో? నీ తస్సాదియ్యా, అట్నే కూసో. నేనూ కూసొంటాను. [బిడ్డను దించి తాను కొంచెము దూరముగా కూర్చుండును.]

కళ్యాణ : ఈ మొరటు ముండాకొడుకు మీకు డిసపాయింట్‌మెంట్ (disappointment) కలిగించేలాగుంది.

రంగా : wait and see

వెంకట : ఆమెను ఆసుపత్రికి తీసుకొని పోవాలంటే జట్కా వాళ్ళు రాలేదు. మేమిద్దర మున్నాము. బిడ్డ నెత్తుకొని రావడానికి యింకొక్కమనిషి కావాల.

వెంకటే : [వెంకటరెడ్డితట్టు ఉరిమి చూచును]

భార్య : కల్లర తగిల్నోళ్ళకు ఆసుపత్తిరిలో మందిస్తారా? ఇస్తే నయమవుతుందయ్యా?

వెంకట : మందిస్తారు. ఇంజక్షన్ చేస్తారు. తప్పకుండా నయమవుతుంది.

భార్య : అట్లయితే ఆసుపత్తిరికి తీసుకొని పొండయ్యాపాపం!

వెంకటే : ఈ పట్న వాసాల్లో వాళ్ళ మాటలుగాని, అంకమ్మ తగిలితే ఆసుపత్తిరిలో బాగవుతుందా? మేకపోతుని మొక్కోండయ్యా. - నీకేం ముశించిందేమె ఆపాట్నే కూసోనున్నావు? ఇంతా వచ్చిందానికి ఆతీర్తం దొరక్కపోయెను. పెసాదంకూడా దొరకనేలేదు. కాశ ముందుగా పొయ్యి దేవళంలో కూర్చుంటాము రావె. [లేచును]