పుట:2015.392383.Kavi-Kokila.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవికోకిల గ్రంథావళి

రంగా : Sorry, excuse me. పరధ్యాన్నంలో క్రింద వేశాను, [తన బూడ్సుకాలుతో దానిని రాచివేయును.]

కళ్యాణ : [కాలు చూచుకొని] బొబ్బపోయిందండి.

వెంకట : నైన చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక:!

కళ్యాణ : చురుక్కుమని చస్తుంటె యిప్పుడుకూడా వేళా కోళమేనా?

వెంకట : తమరు సెలవిచ్చిందే కదండి?

[ఇంతలో నరసింహం వచ్చి సైకిల్ అచ్చటపెట్టి సోడా ఆమె నోటిలో పోయును.]

రోగి : [సోడా త్రాగి] అబ్బా! తండ్రీ, నాబాధ యెవరు తీరుస్తారయ్యా?

రంగా : ఈ పోజ్ (pose) చాలా అద్భుతంగా వుంది. మొగంలో ట్య్రాజిక్ బ్యూటి (tragic beauty) తాండవిస్తూ వుంది. ఇప్పుడు గాన నందలాల్ బోసు వుండి ఈ మాడల్ (model) ప్రకారం ఒక చిత్రం వ్రాస్తే డయింగ్‌ప్రిన్సు (dying prince) అనే మొగల్ చిత్రానికంటే బాగుంటుంది.

[హాండ్ క్యామిరా తెరచి ఫోకస్‌చేసి ఫోటోయెత్తును.]

మీకుగూడా ఒకకాపీ యిస్తానులెండి.

కళ్యాణ : ఈతూరి సిగరెట్టుముక్క జాగ్రత్తగా పాఱవేయండి.

రంగా : థాంక్స్ (thanks)

వెంకట : నరసింహం, ఇక మనము ఆలస్యం చేయడం బాగులేదు. ఈమెను సెగ్రిగేషన్ హౌసుకు తీసుకొనివెళ్ళాల. మన గ్రహచారం