పుట:2015.392383.Kavi-Kokila.pdf/302

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవికోకిల గ్రంథావళి

వెంకట : ఆ దివ్యశక్తి బీహారు భూకంపం లాగా నాలుగుచోట్ల వస్తేనేగాని అందరికి ఒక్కసారిగా ముక్తిగలుగదు. ఉట్టికెక్కలేనివాళ్ళు స్వర్గానికెక్కుతారట!

రంగా : ఈకాంగ్రెస్ క్రీడులోనే వుంది యీ తలబిరుసుతనం నాజూకుగా మాట్లాడేది వీళ్ళకు తెలియనే తెలియదు.

అయ్య : [వెంకటరెడ్డికి కాఫీతెచ్చి యిచ్చును.]

వెంకట : [రెండుగుక్కలు త్రాగును.]

కళ్యాణ : గాంధీ లోకాన్ని పట్టుకొని యింకా వూగులాడుతున్నాడు. ఆయన్ను సెయింట్ (saint) అనడం అక్రమం. అందరి కళ్ళకు కనబడుతూ అందరితో మాట్లాడేవాడు సెయింట్ కానేకాడు. సెయింట్ అంటే మా మహర్షికి ఒక్కడికే చెల్లుతుంది. ఒక్క మదర్ (mother) కు తప్ప ఆయన ఇంకొక మానవుడి కంటికి కనబడడు. ఆయన స్పెన్సరు కంపెనీ చుట్టలు తప్ప మరేవి తాగడని అందరూ అనుకొంటారుగాని ఆయన వుద్దేశం వీళ్ళెవరికి తెలియదు.

వెంకట : మీకు తెలిస్తే చెప్పండి

కళ్యాణ : గాంధి ద్వేషంతో పరదేశి గుడ్డలను తగులబెట్టించాడు. మా మహర్షి ఏమాత్రం ద్వేషబుద్ధి లేకుండా పరదేశీ వస్తువును ప్రయోజనకరంగా తగులబెడుతున్నాడు. ప్రేమలో వైరాగ్యం సాధిస్తున్నాడు. ప్రకృతి పురుషుల సంయోగమె సృష్టికి మూలమని ఋజువుచేశాడు. -

అయ్య : [టీ తెచ్చి పెట్టును.]

రంగా : మా గురుదేవుడికి మోస్తరే మహర్షికికూడా ఇన్‌టర్ నేషనల్ ఔట్ లుక్ (international out-look) వుంది. మహర్షి చాలా గ్రేట్ జీనియస్! (great genius) అందుకు ఏమాత్రం సందేహం