పుట:2015.392383.Kavi-Kokila.pdf/300

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవికోకిల గ్రంథావళి

దానికంటే ఘోరం, పాపం, అక్రమం, అన్యాయం ఫిక్ షన్ (fiction) లో కూడా వుండదండి. గాంధి ఆర్టును మర్డరు (murder)చేశాడు.

కళ్యాణ : కొంపదీసి పాఅలిటిక్‌స్‌లో యాక్‌షన్ (action) తెచ్చి పెట్టాడు.

వెంకట : [నములుచున్న పదార్థం మ్రింగి]మీ పొరపాటు చాలా శోచనీయంగావుందండి. మీరు తెలుసుకోగలిగిన దానికంటే గాంధీ చాలా గొప్ప ఆర్టిస్టు. ఆయన ఆర్టును తెలుసుకోవలెనంటే మీకు ఇంకా కొంత యథార్థమైన (culture) కల్‌చర్ కావాలె. ఆయన క్యాన్ వాస్ (canvas) అయిదారడుగుల చుట్టుకొలత కలదిగాదు; హిందూదేశమంత విశాలమైనది. ఆయన న్యూటన్ కంపెనీ రంగులతో చిత్రింపడు. లోక కళ్యాణానికి ఆత్మార్పణం గావించిన తన నిరాడంబర జీవితం నుండి అపూర్వమైన త్యాగసౌరభం ఈ అనంతభారతీయాకాశాన్నంటి ఇంద్ర ధనుర్వర్ణములతో ప్రభాతరాగ జ్వాలలను చిత్రిస్తున్నది. ఆ మనోహర దృశ్యం ప్రపంచమంతట అన్ని జాతులవారిని ఆశ్చర్యముగ్ధులను గావిస్తున్నది.

రంగా : కాంగ్రెసు వాళ్ళల్ణోకూడా కొంత పోయిటిక్ టచ్ (poetic touch) ఉందన్నమాట! ఎ రెవెలేషన్! (a revelation!)

వెంకట : నామాటల్లో కవిత్వం గాదు ప్రధానం, విషయం.

కళ్యాణ : మా మహర్షి విషయగర్భితంగా కవిత్వము వ్రాస్తారు. చిత్తరంజనుని సాగరసంగీతం ఇంగ్లీషు కవిత్వంలోకి తర్జుమాచేశారు. మీరు చూశారా? అందులో సముద్రఘోష ప్రతిధ్వనిస్తుంటుంది.

వెంకట : ప్రజాఘోష ప్రతిధ్వనిస్తే బాగుండేదేమో. - ఇప్పుడు మీబోటివారంతా A thing of besuty is a joy for ever అని పాఠం వొప్పజెప్పి సంతృప్తిపడుతుంటే, గాంధీ ఆ thing of beauty ని తన దైనందిన జీవితంలో సమ్మేళనంచేసి ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.