పుట:2015.392383.Kavi-Kokila.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాంగ్రెస్‌వాలా

అయ్య : ఆ జంగ్లీగాడ్దెకు ఎన్నిమాట్లు చెప్పినా దినం కొత్తేనండి ఏమిరా జంగ్లీ - ఏమి చేస్తున్నావురా? = ఈప్లేట్లు తీసివేయ్.

[ఇంతలో ఏనాదివాడు బక్కెటు పట్టుకొని వచ్చి ప్లేట్లను ఆకులను దానిలో వేసికొని ఒక మురికిగుడ్డతో టేబిలును తుడిచిపోవును.]

అయ్య : స్వీటు కావలిస్తే - బాదంహల్వా, రవాకేసరి, మైసూర్‌ పాక్, లడ్డూ, జాంగ్రీ, పాల్‌కోవా, గులాబ్‌జాన్, గౌరీజాన్, ఎట్‌సెట్రా. కారం కావలిస్తె - కారాబూంది, పగోడి...

[కళ్యాణరెడ్డి ప్రవేశించును. ఈయన మల్లు చొక్కాతొడిగికొని గోరంచు ఉత్తరీయము వేసికొనియుండును. వయస్సు షుమారు ముప్పది సంవత్సరము లుండును.]

కళ్యాణరెడ్డి : ఓహో! ఎప్పుడొచ్చారండీ, రంగారావుగారూ?

రంగా : వారంరోజులైంది.

కళ్యాణ : చాలరోజులకు దర్శనం.

రంగా : మీరు గ్రామంలోనే వున్నారా?

కళ్యాణ : లేదండి. నేను పుదుచ్చేరి ఆశ్రమంలో వున్నాను.

రంగా : ఓహో!

కళ్యాణ : [అయ్యరు తట్టు తిరిగి] ఏమున్నాయండి.

అయ్య : రవాకేసరీ, బాదంహల్వా, మైసూర్పాక్, జాంగ్రీ, గులాబ్‌జాన్...

[వెంకటరెడ్డి ప్రవేశించును. కుడితిని, పంచె, ఉత్తరీయము, టోపీ ఖద్దరువి. చేతికి తగిలించుకొన్న ఖద్దరుసంచిలో ఒక పుస్తకము, ఒక వార్తాపత్రిక, కరపత్రము లుండును.]