పుట:2015.392383.Kavi-Kokila.pdf/268

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మాధవ విజయము

౨౮౩


మాధః శాంతి! శాంతి! ఎక్కడిశాంతి? కటికవాని గండ్రగొడ్డలిని నిరపరాధుని కంఠముపై పెట్టి శాంతి బోధించుచున్నావు.

                       కఱకుటమ్ముల మేను గాఱింపఁబడిన కే
                                సరికి శాంతము నేర్పఁజాలుదేని,
                       జ్వాలాప్రచండమై జ్వలియించు దవవహ్ని
                                కోరిమి శిక్షింప నోపుదేని,
                       భిన్నోన్ముఖంబైన భీకరాగ్ని గిరీంద్ర
                                మునకు వాకట్టంగఁబూనుదేని,
                       ఝంఝామరుద్భిన్న సాగరోర్మికలకు
                                మహిత సంక్షోభంబు మాన్పుదేని

                       నాకు—నిరపరాధునకు—వినష్టమధుర
                       జీవితాశునకు— వ్యధావిశీర్ణమతికి—
                       మృత్యుభావన్మోత్తున—కింక నీవు
                       శాంతి శాస్త్రంబు బోధింపఁజాలుదేమొ!

విజః మాధవా, బహుభాషలకు సమయముకాదు. ప్రతినిమిషము నీ ఆయువును హరించుచున్నది. నీహితము కోరియుండనియెడల అర్ధరాత్రమున నేనేల రహస్యముగ ఈకారాగృహమునకు వత్తును?

మాధ : [ఆశ్చర్యముతో] రహస్యముగనా—మీమాటలు నా కర్థమగుటలేదు!

విజ : బేలవు! రేపు నీమరణదండనము నిర్వహింపఁబడును. నేనేమి సాహాయ్య మొనరించినను ఈరాత్రియే యొనర్పవలయును. ఒకఅశ్వమును