పుట:2015.392383.Kavi-Kokila.pdf/248

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాధవ విజయము

లను. అన్యాపదేశ దూషణములను సహింపఁజాలను. ప్రత్యక్షముగ నీవు నాహృదయమును చూడఁగలుగుదువేని, ఒక్కొక్క యణుమాత్రస్థలము నొకొక్కక్షతము! ఒకొక్కక్షతమును రక్తస్రావి! ఒకొక్క రక్తబిందువును నాజీవిత సారము!

మనో : అయ్యో! నీవెన్నడును నింత కలఁత నొందియెఱుఁగవు. ఆ పొగరుఁబోతు రాజశేఖరుఁడే నిన్ను మితిమీఱ నొప్పించియుండవలయును.

శ్యామ : అనుమానమెందుకమ్మా? నిజంగా నే వుండవచ్చును.

మాధ : మనోరమా, నేను బిచ్చకత్తె బిడ్డనని తూలనాడినందుకు నాకేమి యవమానములేదు; లోకమున నందఱును భాగ్యవంతులుగ నుండరు. - నేను జారిణీకుమారుఁడనా? తన యపవిత్రకళంకమును కప్పిపుచ్చటకు మాతల్లి నన్ను నిశ్చింతముగ పాఱవైచినదా? [సంక్షుబ్ధ చిత్తుఁడయి] మాతల్లిజారిణి! దుస్సహము - ఓరి రాజశేఖరా, నేను మీతండ్రికి మరణ పర్యంతము ఋణపడియుండనియెడల - [కత్తిపైచేయి వేయును.]

మనో : ప్రాణమిత్రమా, నన్నుగుఱించియైన ఆబాలిశుని నీచోక్తులు మన్నింపుమని వేడికొనుటకును నోరాడకున్నది.

మాధ : వీడ్కొలుపుము. కాలయాపనమగు చున్నది. నీయనురాగ స్మృతి యను మహాప్రదీపమును చేతనుంచుకొని నాజీవితకాళరాత్రి నంతయు నిర్బయముగఁ గడపెదను. [కదలును.]

మనో : [చేయిపట్టుకొని] నీవు నిజముగ వెడలవలయునా? ఇంకొక యుపాయములేదా?

మాధ : నే నింకొక్క నిమిషమైన యీయింట నుండఁజాలను. ఈ బూటకపు జీవనము నాకు నరకము వెలెనున్నది. రాజులయింట నునికి - సర్వసౌఖ్యము లనుభవించుచున్నట్టు లగుపడుట - హృదయముమాత్రము బయటి కగపడని ఱంపకోఁతలతో జర్జరితమగుట! ఇది యేటి బ్రతుకు?