పుట:2015.392383.Kavi-Kokila.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవికోకిల గ్రంథావళి

ఆ నీచుఁడు నాదయకు పాత్రుఁడు కాఁడు. వాని యుద్యోగమును నీవు నిర్వహింప నభిలషింతువా?

...అచ్యు : దేవర కరుణ.

విజ : మిగత విషయము నీ వూహింపఁగలవు. సమయము చూడుము, ఇచ్చటకాదు; తెలిసినదా?

అచ్యు : గ్రహించితిని.

విజ : పొమ్ము నీయదృష్టము నీచేతిలోనున్నది.

అచ్యు : మహాభాగ్యము.

[నిష్క్రమించును.]

విజ : రాజశేఖరుఁడు నాకొఱకు వేచియుండు నేమొ.

[నిష్క్రమించును.]

తెరజాఱును.

________