పుట:2015.392383.Kavi-Kokila.pdf/231

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవికోకిల గ్రంథావళి

ముంగిట ఏలయుంచి పోయియుండరాదు? తరువాత రెండుమూడుదినములకే యాతఁడు కాశీయాత్రకనిచెప్పి యూరువెడలెను. ఇంతవఱకు పోబడియే లేదు. అన్నియు సరిపోవుచున్నవి. ఇది యథార్థమైయుండునా? లేక నాభావనయా? వానికి కుడితొడపై పెద్ద పుట్టుమచ్చ యుండవలయును; ఆ యానవలె సత్యమును నిర్ణయింపఁగలదు.

[మాధవవర్మయు సమరసేనుఁడును ప్రవేశింతురు]

విజ : విచ్చేయుఁడు.

సమసేనుఁడు : మాధవవర్మగారు మనలను చాల స్నేహముతో విచారించుచున్నారు. మన పరివారమున కంతయు సంతృప్తికరముగా నేర్పాటులు గావించిరి.

విజ : మాధవవర్మగారికి మనము కృతజ్ఞులము.

మాధవవర్మ : ఇందు నా యోగ్యతయేమియు లేదు. అంతయు శాంతవర్మగారి యుత్తరువు.

విజ : మిమ్ములను గాంచినప్పటినుండియు మీయెడల నాకు బంధుప్రీతి పొడముచున్నది. శాంతవర్మగారు మిమ్ము సొంత కుమారునివలె ఆదరింతురని తలంచెదను.

మాధ : అవును. తండ్రివలె నన్ను నాదరింతురు. [స్వగతము] ఈతని గాంచినంతనె నిర్ణిమిత్తముగ నాకు వికర్షణము కలుగుచున్నది. ఇతఁడు మా కుటుంబ రహస్యములను నెమ్మదిగ జాఱఁదీయుటకు యత్నించు చున్నాఁడు.

విజ : రాజశేఖరవర్మగారుకూడ మిమ్ము సోదరప్రీతిలో చూచు చుందురు గదా?

మాధ : అవును.