పుట:2015.392383.Kavi-Kokila.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాధవ విజయము

చూచితిమి. ఆబిడ్డ మృతినొందినవానివలె నగపడెను. అంతట వైద్యుని రప్పించి పరీక్షింపఁజేసితిమి. శిశువునకు మూర్ఛరోగమనియు కొంతసేపటికి స్మృతికలుగవచ్చుననియు ఆతఁడు చెప్పెను.

విజ : వింతగా నున్నది!

శాంత : మధ్యాహ్న మగునప్పటికి ఆబిడ్డ యేడువసాగెను. మా కప్పటికి సంతానము లేనందున దైవదత్తమని ఆపసిబిడ్డను పెంచుకొంటిమి.

విజ : అప్పటి కా బిడ్డకు ఎంత వయస్సుండినది?

శాంత : బహుశా మూడు సంవత్సరము లుండవచ్చును.

విజ : ఆ పరిచారిక యిపుడున్నదా?

శాంత : రెండుసంవత్సరములకు పూర్వము మరణించినది.

విజ : ఓహో!

శాంత : మాధవుఁడెచ్చటికి పోయెను? - మీరు కొంచెము విశ్రమింపఁడు.

[నిష్క్రమించును.]

విజ : [ఆలోచనామగ్నుఁడయి తిరుగుచు] - పదునెనిమిది - సంవత్సరములకు పూర్వము! - అప్పటికి రెండుమూడు సంవత్సరముల బాలుడు! - స్మృతితప్పి మృతునివలె పడియుండెను! ఇంతవఱకు కొంచె మించుమించు సరిపోవుచున్నది! మాలతి మొగము పోలికలు గలవాఁడు మఱియెవ్వఁడుగ నుండును? ఓ! వంచింపఁబడితిని. ఆవైద్యుఁడు నన్ను మోసగించి విషమునకుమాఱు మరణమువంటి మైకము కప్పించు నేదియో మత్తుపదార్థమునిచ్చియుండును. అవునవును! బాలునిశవమును దహనము చేయవలయునని నేనంటిని. శిశువు గావున భూమిలో నిక్షేపించుట యుక్తమని ఆవైద్యుఁడు చెప్పెను. ఆ నాఁటి రాత్రియే నిక్షేపింపఁబడెను. ఆతఁడే రహస్యముగ ఆ శిశువును తెచ్చి సంతానరహితులైన వీరి హజారపు