పుట:2015.392383.Kavi-Kokila.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవికోకిల గ్రంథావళి


శాంత : మీవంటి యల్లుఁడు మాకు దొరకుట పూర్వపుణ్యము! మీయంగీకారమును అంత:పురమున తెలిపివచ్చెదను.

విజ : అంత తొందర పడకుఁడు. ఈ సంబంధము మీకు నచ్చినట్లు తక్కినవారికి నచ్చవలయునుగదా?

శాంత : వారెవ్వరును నా కవిధేయులుగ నుండఁజాలరు. ఎవడురా అక్కడ ?

ద్వారపాలకుఁడు : స్వామి!

శాంత : మాధవుని యిచ్చటికి రమ్మనుము.

ద్వార : చిత్తం. [నిష్క్రమించును.]

శాంత : మాధవునితో మీరు ప్రొద్దుపుచ్చుకొనవచ్చును. ఆతఁడు వివేకి; మట్టుమర్యాద లెఱిఁగిన గుణవంతుఁడు.

[మాధవవర్మ ప్రవేశించును.]

విజ : కూర్చుండుఁడు.

మాధవవర్మ : [నిలిచియుండును]

విజ : అయ్యా, యీయన మీపుత్రుఁడా?

మాధ : [చింతతో మొగము వ్రేలాడవేసుకొనును] [స్వగతము] ఈనిష్కపటహృదయుఁడు నా యనాథచరిత్రమంతయు చెప్పివేయునేమో.

శాంత : కాదు, కుమారునివలె పెంచుకొంటిమి.

విజ : [స్వగతము] మాలతి పోలికలు ఈతనిమొగమునందు పొడకట్టుచున్నవి. [ప్రకాశముగ] ఏమీ! మీ యౌరసుఁడు కాఁడా?

మాధ : మరల ఇప్పుడే వచ్చెదను. [నిష్క్రమించును]

శాంత : ఇప్పటికి షుమారు పదు నెనిమిది సంవత్సరములకు పూర్వము ఒక నాఁటిరాత్రి ఎవరో మా హజారపు సోపానములపై వానిని పడవేసిపోయిరి. ప్రొద్దున నే పరిచారిక యొకటి మా కీసంగతి యెఱిఁగించెను. మేము పోయి