పుట:2015.392383.Kavi-Kokila.pdf/214

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మాధవ విజయము.

స్థలము 1 : హేమనగరము.

[విజయవర్మ విశ్రాంతిమందిరమున అటు నిటు తిరుగు చుండఁగా తెర యెత్తఁబడును]

విజయవర్మ : మధ్యాహ్నము కావచ్చినను వీరేల యింకను ప్రయాణ సన్నాహము కావింపకున్నారు? సేవకుఁడు మొదలు సైన్యాధిపతివఱకు అందఱును సోమరిపోతులు ! ఎంతటినేరమునైన మన్నింతునుగాని, సోమరితనమును మాత్రము మన్నింపఁజాలను.

[సమరసేనుఁడు ప్రవేశించును]

విజ : సమరసేనా, యేల యీ యాలస్యము?

సమరసేనుఁడు : గంతగుఱ్ఱములకు సామాను లెక్కించుచున్నారు. నెలదినముల ప్రయాణమునకు వలయు పదార్థములు సిద్ధము చేయించితిని. ఇంకనొక యరగడియలో మనము బయలుదేరుదము.

విజ : తమయింట రెండుదినములు బసచేయవలయునని శాంతవర్మ గారు మన కాహ్వానము పంపిరి.

సమ : మన ప్రయాణమున కభ్యంతరమగునుగదా!

విజ : [చిఱునవ్వుతో] ఆ యాహ్వానము తెప్పించుటకే యీ ప్రయాణము.

సమ : [ఆశ్చర్యముతో] ఏమీ! - ఉత్కళదేశ ప్రయాణము నెపము మాత్రమేనా? [కొంచెము తలయూఁపుచు] పూర్వమువలె మీ